Breaking News

ఓట్లను తొలగిస్తున్నారు

Published on Thu, 12/12/2024 - 06:00

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలో ఆప్‌ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల  సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది.

 ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్‌ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్‌ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. 

దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. షాహ్‌దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)