Breaking News

లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె?

Published on Sun, 12/17/2023 - 11:25

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం కూడా పెరుగుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇంతలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ)కు చెందిన ఒక ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది.

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ రెండవ కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోహిణి ఇటీవల తన అత్తా మామల ఇంటికి బీహార్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కారాకాట్‌ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు డిమాండ్‌ చేశారు. ఆమె ఎంపీగా  ఎన్నికైతే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. 

తొలుత ఆమె ఈ వినతిని తిరస్కరించినా తాను  తల్లిదండ్రులు మాటకు కట్టుబడి ఉంటానని మీడియాకు తెలియజేశారు. కారాకాట్‌ ప్రజలు తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకంటే తనకు  అభ్యంతరం చెప్పలేనని అమె అన్నారు. 

లాలూ ప్రసాద్ యాదవ్ సంతానమైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, మిసా భారతి ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రోహిణి ఆచార్య.. సోషల్ మీడియాలో బీహార్ రాజకీయాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. రోహిణి తన కిడ్నీలో ఒకదానిని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానం చేయడంతో అందరి దృష్టిలో పడ్డారు. ఆమె ఎంబీబీఎస్‌ చదువుతున్న సమయంలోనే ఇంజనీర్ సమేష్‌ని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె భర్త, కుటుంబంతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)