Breaking News

ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!

Published on Tue, 03/12/2024 - 09:16

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు.

2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ‍ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో  నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)