Breaking News

లద్దాఖ్‌ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ అరెస్ట్‌

Published on Fri, 09/26/2025 - 17:09

ఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ (Sonam Wangchuk)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లకు కారణం వాంగ్‌చుక్‌గా కారణంగా భావిస్తూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హింసను రెచ్చగొట్టినట్టు వాంగ్‌చుక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాంగ్‌చుక్‌ ఎన్‌జీవో లైసెన్స్‌ను సైతం కేంద్రం రద్దు చేసింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఆయన స్థాపించినస్వచ్ఛంద సంస్థ( SECMOL)కు విదేశీ నిధులు స్వీకరించే హక్కును కూడా రద్దు చేసింది. అరెస్టుకు ముందు వాంగ్‌చుక్ వ్యాఖ్యానిస్తూ..  ఈ ఉద్యమం కోసం అరెస్టయితే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. లద్దాఖ్‌ రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించించిన సంగతి తెలిసిందే. దీంతో వాంగ్‌చుక్.. తాను చేపట్టిన రెండు వారాల దీక్షను కూడా ఆయన ముగించిన సంగతి తెలిసిందే.

లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్‌పీఎఫ్‌ వ్యాన్‌ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు.

ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)