అయ్యో సాషా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటి మృతి

Published on Mon, 03/27/2023 - 20:57

నమీబియా నుంచి తీసుకువచ్చి గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ఉంచిన 8 చీతాల్లో ఒక చీతా మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. సాషా భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న ఈ చీతాలో అలసట, బలహీనత వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని, దీంతో చికిత్స కోసం క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌కు తరలించామని తెలిపారు. ​కాగా సాషా వయసు మూడేళ్లు. ఇది క్యాప్టివ్ బ్రీడ్‌ జాతికి చెందినది

భారత్‌లో అంతరించిపోతున్న చీతాలను  తిరిగి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్‌ 17)  8 ఆఫ్రీకన్‌ చీతాలను కునో నేషనల్‌ పార్కు క్వారంటైన్‌ జోన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలను కొన్ని నెలల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్‌ చేశారు. 

భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత నవంబర్‌లో పెద్ద ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షించారు తరువాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెట్టారు. అంతేగాక త్వరలోనే భారత్‌కు మరో 12 చీతాలు కూడా రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)