Breaking News

హవా హవాయీ!.. నిర్మలా సీతారామన్‌ టార్గెట్‌గా కునాల్‌ కమ్రా వ్యాఖ్యలు

Published on Thu, 03/27/2025 - 07:11

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై వ్యంగ్య కామెడీతో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన స్టాండప్‌ కమేడియన్‌ కునాల్‌ కమ్రా తాజాగా మరో వివాదానికి తెర తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆమె ఆర్థిక విధానాలను విమర్శిస్తూ సూపర్‌ హిట్‌ హిందీ సినిమా ‘మిస్టర్‌ ఇండియా’లోని ఐకానిక్‌ పాట ‘హవా హవాయీ’ని పేరడీ చేశారు. ‘ఆప్‌ కా ట్యాక్స్‌ కా పైసా హో రహా హవా హవాయీ (జనాలు కట్టే పన్నుల డబ్బులు గోల్‌మాల్‌ అవుతున్నాయి)’అంటూ బుధవారం విడుదల చేసిన వీడియోలో చెణుకులు విసిరారు.

తాజాగా కునాల్‌ కమ్రాన్‌.. ‘ట్రాఫిక్‌ బఢానే ఏ హై ఆయీ, బ్రిడ్జెస్‌ గిరానే ఏ హై ఆయీ, కెహతే ఇస్‌ కో తానాషాహీ (అది ఉన్నదే ట్రాఫిక్‌ కష్టాలు పెంచేందుకు, బ్రిడ్జిలను కూలగొట్టేందుకు. నియంతృత్వం అంటారు దాన్ని)’ అంటూ అధికార బీజేపీ తీరుపైనా వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అయితే తమ పాటను అనుమతి లేకుండా వాడుకోవడం ద్వారా కామ్రా కాపీరైట్‌ను ఉల్లంఘించారని టీ సిరీస్‌ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాజా పేరడీని యూట్యూబ్‌లో బ్లాక్‌ చేయించింది. దీన్ని కామ్రా తీవ్రంగా తప్పుబట్టారు. 

మరోవైపు షిండే ఉదంతంలో విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తిరస్కరించారు. తక్షణం విచారణకు రావాలంటూ రెండోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను టార్గెట్‌ చేసిన కునాల్‌ కమ్రా.. క్లబ్‌లో ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. షిండేను దోశద్రోహి అంటూ విమర్శిస్తూ పేరడి పాట పాడారు. దీంతో, శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో క్లబ్‌పై దాడిపై చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)