Breaking News

Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..

Published on Sat, 11/16/2024 - 13:57

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్‌ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది.  

శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్‌ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ‍ప్రాణాలతో పోరాడుతున్నారు.

10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో  ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్‌ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.

తరువాత కులదీప్‌ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్‌ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్‌ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. 

ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)