Breaking News

కోల్‌కత్తా పార్క్ స్ట్రీట్‌ రేప్‌ కేసు దోషి : మరో అఘాయిత్యం

Published on Wed, 10/29/2025 - 15:40

2012లో కోల్‌కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లోని ఒక నైట్ క్లబ్‌లో స్నేహితులతో కదులు తున్న  కారులో ఒక మహిళపై సామూహిక అత్యాచారచేసిన శిక్ష అనుభవించిన నాజర్‌ ఖాన్ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. కోల్‌కత్తాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒక మహిళను లైంగికంగా వేధించాడు. గాజు సీసాలతో దాడి చేశాడు.

సంచలనం రేపిన పార్క్‌ స్ట్రీట్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషిగా తేలిన  35 ఏళ్ల నాజర్ ప్రెసిడెన్సీ జైలు నుండి బయటకు వచ్చాడు. మంచి ప్రవర్తన కారణంగా ఏడాది ముందే జైలు విడుదలైన అతగాడు ఏమీ మారలేదు సరికదా, మరోసారి తన దుర్మార్గ వైఖరిని చాటుకున్నాడు. కోల్‌కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లోని 5-స్టార్ హోటల్‌లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన భర్త, స్నేహితులతో ఉండగా, ఆమెను వేధించడంతోపాటు, గాజుసీసాలతో వారిపై దాడికి పాల్పడ్డాడు. బిధాన్‌నగర్‌లోని హయత్ రీజెన్సీలోని ప్లే బాయ్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతం ఈ ఘటన జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈకేసులో ఉన్న  నిందితులతోపాటు 2012 పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన నాజర్ ఖాన్ ఉన్నాడు. మరో నిందితుడు నాజర్‌ మేనల్లుడు జునైద్ ఖాన్. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. 

క్లబ్‌లో తాను, తన భర్త, సోదరుడు,  ఇతర స్నేహితులతో కూర్చుని ఉండగా నిందితులు గలాటా చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నాజర్‌, జునైద్ ఇంకా వారి స్నేహితులు తమపై దాడి చేసి, తనను అనుచితంగా తాకడానికి ప్రయత్నించారని ఆ మహిళ ఆరోపించింది. సోదరుడు తనను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, గాజు సీసాలు విసిరారని పేర్కొంది. హోటల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించి నప్పటికీ వారు వదల్లేదనీ,  జునైద్ ఖాన్ దాదాపు 20 మందికి ఫోన్ చేసి తమపై దాడి చేశాడని, ఫోన్‌లో చంపుతామని కూడా బెదిరించారని ఆమె తన  ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ క్లబ్  CCTVలో ఈ దాడికి  సంబంధించిన మొత్తం వీడియోను మీరు చూడవచ్చన్నారు ఆమె.

కాగా  2012 ఫిబ్రవరిలో నగరం నడిబొడ్డున ఉన్న పార్క్ స్ట్రీట్‌లోని ఒక నైట్ క్లబ్ ముందు 40 ఏళ్ల మహిళను కారులో తీసుకెళ్లి, కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు క్రాసింగ్ దగ్గర  విసిరేసి వెళ్లిపోయారు.  ఈ కేసులో దోషిగా తేలిన ఐదుగురు వ్యక్తులలో నాజర్‌ కూడా ఉన్నాడు. పదేళ్ల శిక్షాకాలం ముగియడానికి ఒక సంవత్సరం కంటే ముందే 2020లో జైలు నుండి విడుదలయ్యాడు. 

ఇదీ చదవండి: హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్‌లా ఇంత అందమా? ఎలా?

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)