Breaking News

కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్‌

Published on Sat, 05/31/2025 - 01:11

కోల్‌కతా: ఉద్యోగాలు కోల్పోయి నిరసనకు దిగిన సుమారు 150 మంది ఉపాధ్యాయులను కోల్‌కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మళ్లీ ఎంపిక పరీక్ష పెడతామంటూ పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపేందుకు సెక్రటేరియట్‌ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని 100 మందిని అరెస్ట్‌ చేశారు. 

కోల్‌కతాలోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద కూడా మరో 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఇదే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సాల్ట్‌లేక్, ఎస్‌ప్లనేడ్‌ల వద్ద వందలాది మంది టీచర్లు నిరసనకు దిగారు. సెక్రటేరియట్‌ వైపు వెళ్తున్న వీరిని పోలీసులు ఆపేశారు. తమ పరిస్థితిని వివరించేందుకు సీఎం మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. సాల్ట్‌లేక్‌ వద్ద 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. 

అయితే, టీచర్లు షర్టులు తీసేసి ర్యాలీ చేపట్టడాన్ని పోలీసులు అనుమతించలేదు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టేందుకు వీరికి వీలు కలి్పంచారు. అయితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేందుకు యత్నించిన 50 మంది మాజీ టీచర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళా పోలీసులతో జరిగిన తోపులాటలో కాలికి గాయమైన ఓ మాజీ ఉపాధ్యాయినిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామన్నారు. 

రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం వద్ద గత 22 రోజులుగా కొందరు బాధితులు నిరసన సాగిస్తున్నారు. 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన ఎంపిక పరీక్షల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని తేలడంతో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 3వ తేదీన మొత్తం 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవంటూ సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం 40 వేల టీచర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసిన అనుభవమున్న టీచర్లకు ఈ పరీక్షలో అదనంగా మార్కులుంటాయని ప్రకటించింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)