Breaking News

కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్‌ మీడియాలో చర్చ

Published on Thu, 10/03/2024 - 10:36

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో  జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా బాధితురాలికి సంబంధించిన విగ్రహం ఆవిష్కరణపై సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హత్యాచార సమయంలో ఆమె అనుభవించిన బాధను ప్రతిబింబించేలా విగ్రహాన్ని  అసిత్ సైన్‌ అనే శిల్పి రూపొందించటం గమనార్హం.  ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్‌ ది అవర్‌’గా నామకరణం చేశారు. బాధితురాలి విగ్రహాన్ని ప్రిన్సిపల్‌ ఆఫీసుకు సమీపంలోని పీజీబీ గార్డెన్‌ ఎదుట  ఆవిష్కరించారు.

 

‘‘బాధితురాలి విగ్రహం ఆవిష్కరించటం చాలా భావోద్వేగంతో కూడుకున్న విషయం. ఆమె మా సహోద్యోగి. మేము ఆమె కోసం పోరాడుతున్నాం. ఆమె మన హృదయంలో ఉంది. విగ్రహ ఏర్పాటు ద్వారా ఆమెను ఎవరూ మరచిపోరు’ అని జూనియార్‌ డాక్టర్‌ అన్నారు.‘‘ ఈ విగ్రహం బాధితురాలిది కాదు, ఆమె అనుభవించిన బాధ, హింస, ఆమె కోసం కొనసాగుతున్న నిరసనలకు ప్రతీక’’ అని మరో జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు.

అయితే ఈ విగ్రహం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ.. తయారు చేసిన విధానం అగౌరవంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘‘ అత్యాచార బాధితురాలి ఆధారంగా  ఇలాంటి విగ్రహాన్ని ఎందుకు సృష్టించారు’’, ‘‘ ఇది మంచి ఆలోచన అని ఎవరు భావించారు? దీన్ని ఎవరు ఆమోదించారు?’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ‘‘ అగౌరవ పరిచేవిధంగా ఏం లేదు. కొందరు భారతీయ స్త్రీలను కూడా గర్వంగా గుర్తుంచుకోలేరు’’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై నిర్ణయాత్మకంగా వ్యవహరించే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని జూనియర్‌ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు.

చదవండి: కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే

 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)