Breaking News

కోల్‌కతా డాక్టర్‌ కేసు: 42 డాక్టర్లపై బదిలీపై బీజేపీ ఫైర్‌

Published on Sat, 08/17/2024 - 14:38

కోల్‌కతా: కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్‌ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్‌ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్‌ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు. 

ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్‌, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో పని చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)