Breaking News

‘సీఎం మమత చర్యలు తీసుకొని ఉంటే.. నా బిడ్డ బతికేది’

Published on Wed, 09/18/2024 - 10:14

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితురాలికి న్యాయం చేయాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కూతురికి జరిగిన దారుణ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ల డాక్టర్లు తన బిడ్డలలాంటి వారని అన్నారు. సీఎం మమతా బెనర్జీ 2021లోనే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై చర్యలు తీసుకొని ఉంటే.. ఇవాళ తన కుమార్తె బతికే ఉండేదని అన్నారు.

‘‘ సీబీఐ తన పని తాను చేస్తోంది. సీబీఐ విచారణ గురించి నేను ఏం మాట్లాడలేను. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన వారందరూ విచారణలో ఉన్నారు. తీవ్రమైన బాధతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారంతా నా పిల్లలలాంటి వారు, వారిని చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నిందితులకు శిక్ష పడిన రోజు మనం విజయం సాధించినట్టు. 2021లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పుడే సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమత బెనర్జీ చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు నా కూతురు బతికే ఉండేది’’ అని అన్నారు.

credits: The Savera Times

మరోవైపు.. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటు వేయాలన్న వైద్యుల డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అంగీకరించింది. అనంతరం కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డాక్టర్ల ప్రతినిధి బృందం మధ్య జరిగిన  సమావేశం అనంతరం జూడాల డిమాండ్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ జూనియర్‌ డాక్టర్లు ఇంకా తమ సమ్మెను విరమించకపోవటం గమనార్హం.

చదవండి: జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు