Breaking News

కోల్‌కతా డాక్టర్‌ కేసు: ‘నా కుమారుడిని కావాలని ఇరికించారు’

Published on Sat, 08/24/2024 - 07:32

కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ రాయ్‌, ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రినన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ తల్లి స్పందించారు. తన కుమారుడు ఎవరీకి హనిచేయని వ్యక్తి అని, ఎవరో ఉద్దేశపూర్వంగా ఈ కేసులో ఇరికించారని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తన కుమారుడిని ఇరికించాలని చూసిన వ్యక్తి.. కఠినంగా శిక్షించబడతాడని తెలిపారు.

‘‘నేను నా కుమారుడి పట్ల ఇంకా కఠినంగా ఇప్పడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సంజయ్‌ తండ్రి చాలా కఠినంగా ఉండేవారు. నా భర్త మరణంతో మా కుటుంబం ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది.  ఈ ఘటనలో నా కుమారుడిని ఎవరు ప్రభావితం చేశారో నాకు తెలియదు. కానీ సంజయ్‌ రాయ్‌ని ఈ కేసులో ఇరికించాలని చూసిన వ్యక్తి  ఎవరైనా శిక్షించబడతారు. సంజయ్ రాయ్ క్రీడలపై ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి.  బాక్సింగ్ నేర్చుకునేవాడు. అతను నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో ఉన్నాడు. 

చదువుపరంగా కూడా స్కూల్ టాపర్‌గా నిలిచాడు. నన్ను బాగా చూసుకునేవాడు. నాకు వంట కూడా చేసిపెట్టేవాడు. కావాలంటే  సంజయ​ ఎలాంటివాడో మా ఇంటిపక్కవాళ్లను కూడా అడిగి  తెలుసుకోవచ్చు. సంజయ్‌ ఇప్పటివరకు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను నా కుమారుడిని కలిస్తే.. బాబు  ఇలా  ఎందుకు చేశావని అడుగుతాను. కానీ నా  కుమారుడు  ఏ తప్పూ చేయడు’’ అని అన్నారు. 

తన కుమారుడు ఆర్జీ కర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నట్లు తెలియదన్నారు. అయితే ఘటన జరిగిన రాత్రి మాత్రం సంజయ్‌ రాయ్‌ భోజనం చేయలేదన్నారు. తన కుమారుడు రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లేవాడని వచ్చిన వార్తలను  ఆమె తీవ్రంగా  ఖండించారు. సంజయ్‌ మొదటి భార్య క్యాన్సర్‌లో మరణించటంతో మద్యానికి బానిస అయ్యాడని ఆయన తల్లి తెలిపారు.

ఈ ఘటన జరిగిన రాత్రి సంజయ్‌.. సోనాగచి రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లాడని, మద్యం కూడా సేవించాడని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన  మొబైల్ ఫోన్‌లో  అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో చాలా మంది ప్రమేయం ఉందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సంజయ్‌ రాయ్‌ ఒక్కడిని మాత్రం బలిపశువు చేస్తున్నారని మమత ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)