Breaking News

వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా..

Published on Sat, 07/08/2023 - 13:18

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా, అది ఆ వృద్ధునిపై దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. 

ఎన్నో ప్రయత్నాల తరువాతనే..
ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ వీడియోలో.. ముందుగా ఒక వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కగా ఒక గాడిద నిలుచుని ఉంటుంది. అది ఉన్నట్టుండి, ఆ వృద్ధుని దిశాగా పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడుతుంది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కల వారు ఆ వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఆ గాడిదపైకి రాయి విసిరినా అది ఏమాత్రం అదరదు. మరికొందరు కర్రతో దానిని కొట్టడంతో ఆది తన దాడిని విరమించి పక్కకు వెళ్లిపోతుంది. తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. 
 


మూడు రోజుల్లో రెండవ దాడి ఘటన
గడచిన మూడు రోజుల్లో స్థానికంగా జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు ఆరోపిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు! 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)