Breaking News

‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం!

Published on Sat, 08/01/2026 - 12:26

కొచ్చి: కేరళలోని కొచ్చికి చెందిన 80 ఏళ్ల ఎంబీ ప్రకాశన్ తన తండ్రి జ్ఞాపకంగా మిగిలిన 1957 మోడల్ రాలే హంబర్ సైకిల్ చోరీకి గురికావడంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కలమస్సేరికి చెందిన ప్రకాశన్‌కు ఈ సైకిల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం కలకత్తా లాటరీలో వచ్చిన బహుమతి మొత్తంతో ఆయన తండ్రి ఎంఆర్‌ బాలకృష్ణన్ ఎర్నాకులంలో ఈ సైకిల్‌ను కొనుగోలు చేశారు. 2003లో తండ్రి మరణించారు. ఆ సైకిల్‌ను ప్రకాశన్ ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు.

జూలై 22న ఎడపప్పల్లి టోల్ జంక్షన్ సమీపంలో ఇన్సూరెన్స్ పత్రాలు జారీ చేసే సమయంలో కీని సైకిల్‌కే వదిలివేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు సైకిల్‌ను అపహరించారు. తండ్రి 23వ వర్ధంతికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ ఘటన జరగడంతో ప్రకాశన్ తీవ్రంగా కుంగిపోయారు. ‘ఇది నాకు కేవలం ఒక సైకిల్ కాదు, నా తండ్రి జ్ఞాపకం. దానిని పోగొట్టకుని నేను నా తండ్రిని రెండోసారి కోల్పోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కలమస్సేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తెలిసిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ఈ సైకిల్‌ను సురక్షితంగా తిరిగి తెచ్చిచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించడంతో పాటు, దొంగిలించిన వ్యక్తికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కాగా పాఠశాల విద్యార్థులు, స్థానికులు కూడా ఈ సైకిల్ ఆచూకీ కోసం స్వచ్ఛందంగా గాలిస్తుండటం విశేషం. సైకిల్‌ను తిరిగి ఇచ్చేస్తే తాను ఎలాంటి పోలీసు కేసులు పెట్టబోనని, ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని ప్రకాశన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: జంక్‌ ఫుడ్‌ మాన్పించేందుకు డాడీ ‘అల్ట్రాసౌండ్‌’ ఐడియా!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)