యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...

Published on Sun, 04/16/2023 - 05:53

షాజహాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్, శ్రావస్తి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. షాజహాన్‌పూర్‌ జిల్లా అజ్మత్‌పూర్‌కు చెందిన సుమారు 30 మంది గ్రామంలో జరిగే భాగవత కథ కార్యక్రమం కోసం నీటిని తెచ్చేందుకు గర్రా నదికి ట్రాక్టర్‌పై బయలుదేరారు. నిగోహి రోడ్డులో వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్‌ ట్రాలీ నదిలో పడిపోయింది. ఘటనలో 8 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంటున్నారు.

మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మరో ఘటన..శ్రావస్తి, బలరాంపూర్‌ జిల్లాలకు చెందిన కొందరు పంజాబ్‌లోని లూధియానాలో పనులు చేసుకుంటున్నారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఆ వాహనం శనివారం వేకువజామున శ్రావస్తి జిల్లా ఇకౌనా ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్క చెట్టును ఢీకొని, గుంతలో పడిపోయింది. ఘటనలో 9 ఏళ్ల బాలుడు సహా ఆరుగురు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)