Breaking News

ఖర్గేకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Published on Sun, 07/21/2024 - 13:23

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు నేడు(జూలై 21). ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఖర్గే 1942 జూలై 21న జన్మించారు. కర్నాటకకు చెందిన దళిత నేత అయిన ఖర్గే సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. కర్నాటక కాంగ్రెస్‌ పార్టీలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక పదవులు చేపట్టారు. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర తొలి కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఖర్గే నిలిచారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అణగారిన, పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఖర్గే కృషి చేశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)