కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్‌ స్పోర్ట్స్‌ పాలసీకి గ్రీన్‌సిగ్నల్‌

Published on Tue, 07/01/2025 - 16:00

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం  కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల  ప్రోత్సాహం ఇవ్వనుంది.

ఈపీఎఫ్ రెండు వాయిదాలలో  కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. 

పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష  కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్‌అండ్‌డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్‌న​ ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది.

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)