Breaking News

ఇదేం విచిత్రం.. కిలో మీటర్‌ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే?

Published on Mon, 05/22/2023 - 14:40

కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత​ విషయం తెలుసుకున్నలోకోపైలట్‌ దాదాపు కిలోమీటర్‌ వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను దింపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది.

షోరనూర్‌ నుంచి వేనాడ్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు మావెలిక్కర, చెంగన్నూర్‌ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్‌లో రైలు ఎక్కాల్సినవాళ్లు.. ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. కాసేపటికి లోకో పైలట్‌కు వెనక స్టేషన్‌లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్‌లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.

కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్‌లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో  రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్‌ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్‌లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని చెప్పారు.
చదవండి: Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్‌

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)