Breaking News

శబరిమలలో.. చిన్నారుల ట్రాకింగ్‌కు ‘వీఐ బ్యాండ్’

Published on Wed, 11/19/2025 - 16:43

పథనంతిట్ట: శబరిమలలో రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గడిచిన నాలుగు రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల్లో చిన్నారుల వాటా 15శాతంగా ఉండడంతో.. వారి భద్రతకు వొడఫోన్-ఐడియా(వీఐ)తో కలిసి సురక్ష బ్యాండ్‌లను ప్రవేశపెట్టారు. తప్పిపోయిన చిన్నారులను ట్రాక్ చేసేందుకు ఈ బ్యాండ్ ఉపయోగపడుతుంది. 

బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు, వీఐ ప్రతినిధులు ఆ బ్యాండ్లను ఆవిష్కరించారు. మండల, మకరవిళక్కు సీజన్‌లో సెల్ సిగ్నల్స్ మెరుగుపరిచేందేకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వీఐ ప్రతినిధులు తెలిపారు. నీలక్కల్, పంపా, శబరిమల, సన్నిధానం ప్రాంతాల్లో ప్రత్యేకంగా 13 సెల్‌టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఎక్కడా సెల్ సిగ్నల్ డ్రాపవ్వకుండా.. కనెక్టివిటీ ఉంటుందన్నారు. 

పిల్లల భద్రతకు ఇలా..

  • చిన్నారులతో కలిసి వచ్చే అయ్యప్ప భక్తులు పంపాలోని ‘వీఐ సెక్యూరిటీ కియోస్క్’ల వద్ద సెక్యూరిటీ బ్యాండ్‌ను తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఈ బ్యాండ్ల కోసం రిజిస్టర్ అవ్వొచ్చు.

  • కేరళలోని ప్రతి వీఐ స్టోర్‌లో చిన్నారుల సురక్ష బ్యాండ్‌లు లభ్యమవుతాయి.

  • ఈ బ్యాండ్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి బ్యాండ్‌కు ప్రత్యేక డిజిటల్ కోడ్/ఐడీ ఉంటుంది.

  • ఒకవేళ ఈ బ్యాండ్ ఉన్న చిన్నారులు తప్పిపోతే.. వారిని ట్రాక్ చేసి, గుర్తించవచ్చని పథనంతిట్ట ఎస్పీ ఆనంద్ వెల్లడించారు.

  • గత ఏడాది శబరిమల సీజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ బ్యాండ్‌లను ప్రవేశపెట్టామని, అవి సత్ఫలితాలనివ్వడంతో ఈ సారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)