Breaking News

కేసు దాకా వెళ్లిన కోడి కూత

Published on Thu, 02/20/2025 - 06:09

పథనంథిట్ట(కేరళ): ప్రకృతి రమణీయతకు, ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరైన కేరళలో పథనంథిట్ట జిల్లా అంతే స్థాయిలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ జిల్లాలో భూమి కోసమో నగదు కోసమో తగాదా జరిగితే అది వార్త స్థాయికి చేరేదికాదు. కానీ ఒక కోడి కూత ఇప్పుడు ఫిర్యాదుచేసి కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ కోడి అన్ని కోళ్లలాగా ఉదయం ఆరు గంటలకో అంతకు కాస్తంత ముందే కూత పెట్టట్లేదు. ఆ కోడి పుంజు ప్రతిరోజూ ఠంచనుగా తెల్లవారుజామున మూడు గంటలకే కూత అందుకుంటోంది. 

నిశ్శబ్దం రాజ్యమేలే మూడు గంటల వేళ అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ కోడి కూత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. ఇది ముఖ్యంగా పక్కింట్లో ఉండే వృద్ధుడు రాధాకృష్ణ కురూప్‌ నిద్రకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లజేస్తోంది. ఆ శబ్దాలకు నిద్ర పట్టక రాధాకృష్ణ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని ఆ కోడి యజమాని అనిల్‌కుమార్‌కు చెప్పిచూసినా లాభం లేకుండాపోయింది. దీంతో చేసిదిలేక అదూర్‌ రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఆ కోడి పుంజుపై ఫిర్యాదు చేశారు.

 అనారోగ్యంతో బాధపడుతూ రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బందులు పడుతున్న ఆ పెద్దాయన అవస్థ చూడలేక అధికారులు కోడి యజమాని అనిల్‌ కుమార్‌ను పిలిపించారు. తన తప్పేంలేదని యజమాని అనిల్‌ వాదించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పోలీసులు రంగంలోకి దిగి కోళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అనిల్‌ కుమార్‌ ఆ కోళ్లను నేలపై పెంచకుండా తన స్థలంలోని తొలి అంతస్తులో పెంచుతున్నాడు. 

ఎత్తు నుంచి శబ్దం వస్తుండటంతో చుట్టూతా గోడలు, ఎలాంటి అడ్డూ లేకపోవడంతో కోడి కూత పెద్దగా వినిపిస్తోందని అధికారులు తేల్చారు. దీనికి పరిష్కారంగా కోళ్లను మొదటి అంతస్తు నుంచి తరలించి అదే స్థలంలో దక్షిణ వైపు నేలపై పెంచుకోవాలని అధికారులు సూచించారు. మరో 14 రోజుల్లోపు ఈ కోళ్ల తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని యజమాని అనిల్‌కు అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో వృద్ధుడు కాస్తంత ఆనందం వ్యక్తంచేశారు. కోడి కూత అంశం కేసుదాకా వెళ్లిందని ఇరుగుపొరుగు తెగ మాట్లాడుకుంటున్నారు. పళ్లిక్కల్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. 
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)