2 + 2 + 2 + 2

Published on Sat, 08/01/2026 - 01:53

ఇదో అపురూపమైన వివాహం...
ఊహూ.. హంగు ఆర్భాటాల కోసమో...
చవులూరించే విందు, వీనుల విందైన సంగీతం..
ఆకాశమంత పందిరి.. భూదేవంత లోగిళ్లేమీ లేవు. 
అయినా సరే.. ఇది అత్యంత అరుదైన, అపురూపమైన పెళ్లే:
ఎందుకంటారా... చదివేయండి!!!

కేరళలోని చెంగనశెరిలో జరిగింది ఇది. పెళ్లికొడుకులు కవలలు. పెళ్లి కూతుళ్లు కూడా! ఆ.. ఇందులో విశేషమేముంది.. అప్పుడప్పుడు.. అక్కడక్కడ జరిగేవే కదా అంటున్నారా? నిజమే కానీ.. పురోహితులు.... వారి అసిస్టెంట్లు కూడా కవలలైతే అది వెరీ వెరీ స్పెషల్‌ కాకుండా పోతుందా? ఇప్పుడు ఎవరు? ఎక్కడ? ఏమిటి? అన్న వివరాలకు వద్దాం.. ముందే చెప్పినట్టు వివాహం జరిగింది గురువారం చెంగనశెరి మెట్రోపాలిటన్‌ చర్చ్‌లో. అనిల్‌ కే.థామస్, మ్యాగీ మేరీ థామస్‌ చేయి పట్టుకుని నడుస్తూంటే... అతడి కవల సోదరుడు నిఖిల్‌ కే.థామస్‌... మ్యాగీ కవల సోదరి మారియా మేరీ థామస్‌ చేయి పట్టుకుని ఆల్టర్‌వైపు కదిలాడు. 

ఈ రెండు జంటలకు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించింది ఫాదర్‌ ఆంటో పెజుమ్‌కట్టిల్, ఫాదర్‌ అజో పెజుం కట్టిల్‌! వీరిద్దరూ కవలలని వేరుగా చెప్పనవసరం లేదనుకుంటా. ఈ కవలల వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు. వివాహ ఏర్పాట్లలో పురోహితులకు సహాయంగా నిలిచిన జెరోన్‌ జేమ్స్, జొహాన్‌ జేమ్స్‌లు కూడా కవలలే కావడం విశేషం. అబ్బా... ఎంత యాదృచ్ఛికంగా జరిగాయి ఇవన్నీ అనుకుంటూంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే టోమిచాన్, మేరికుట్టీల సంతానమైన మ్యాగీ, మారియాల ఐడియా ఇది. కుంజుమోన్‌ థామస్, జమోల్‌ల కవల సంతానమైన అఖిల్, నిఖిల్‌లను పెళ్లాడాలన్న ఆలోచన మొదలుకొని వివాహాన్ని కవల పురోహితులతోనే జరిపించుకోవాలని కూడా వీరు ప్లాన్‌ చేశారు. 

ఇందుకోసం వారు కవలలు ఎక్కువగా కలిసే కోథనల్లూర్‌ చర్చి సాయం తీసుకున్నారు. ‘‘చుట్టూ కవలల సమక్షంలో పెళ్లి చేసుకోవాలన్నది మా చిన్నప్పటి కల. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆశించారు. జీసస్‌ క్రైస్ట్‌ అది అయ్యేలా చేశారు’’ అని మ్యాగీ, మారియాలు ముసి ముసి నవ్వులతో చెప్పుకొచ్చారు. ఇలాంటి వివాహం జరిపించడం తాము చిరకాలం గుర్తుపెట్టుకుంటామని పురోహితులు తమ సంతోషం వ్యక్తం చేశారు.  ‘‘మేము కూడా కలిసి పుట్టాం. పెరిగాం. అలాగే కలిసి ప్రీస్ట్‌హుడ్‌లోకి ప్రవేశించాం’’ అని వివరించారు. అఖిల్, నిఖిల్‌లు ఇద్దరూ మర్చెంట్‌ నేవీ అధికారులు కాగా.. మ్యాగీ, మారియాలు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. పెళ్లికి హాజరైన అతిథులు ఒక అపురూపమైన ఘట్టానికి సాక్షులుగా నిలిచిపోతే... పిల్లల చిరకాల స్వప్నం ఈడేరినందుకు వధూ వరుల తల్లిదండ్రులు కూడా హాయిగా నిట్టూర్చి ఉంటారు!                                                               

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)