amp pages | Sakshi

వాళ్లిద్దరూ నాతో అసభ్యంగా ప్రవర్తించారు: మహిళా కలెక్టర్‌

Published on Thu, 03/30/2023 - 11:39

తిరువనంతపురం: తమ బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఇటీవల చాలామంది చెబుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణి కూడా చేరారు. తన బాల్యంలో లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు తెలిపారు. త‌నకు ఆరేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని చెప్పుకొచ్చిన ఆమె.. త‌న‌ను వేధించిన వ్య‌క్తుల ముఖాలు ఇప్ప‌టికీ త‌న‌కు గుర్తున్నాయ‌ని తెలిపారు.

నేను లైంగిక వేధింపులకు గురయ్యా..
కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్‌.అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "ఇద్దరు మగవాళ్ళు నాపై ఆప్యాయత చూపేవారు. మొదట్లో, వారు నన్ను ఎందుకు ముట్టుకుంటున్నారో, అప్యాయంగా ఎందుకు పలకరించేవాళ్లో నాకు అర్థం కాలేదు. వారిద్దరూ నాతో అసభ్యకరంగా ప్రవర్తించావాళ్లు, ఆ సమయంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది. ఎలాగోలా వారి నుంచి తప్పించుకోగలిగాను," అని చెప్పుకొచ్చింది.

చివరికి త‌న త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో తాను ఆ బాధ నుంచి త‌ప్పించుకోగ‌లిగాన‌ని వివ‌రించారు. ప్రస్తుత సమాజంలో గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. అయితే ఆ ఘ‌ట‌న త‌ర్వాత త‌న‌ను వేధించిన ఇద్ద‌రూ ఎక్క‌డైనా క‌నిపిస్తారేమోన‌ని చూశాన‌ని కానీ, ఆ త‌ర్వాత వారు త‌న‌కు క‌నిపించ‌లేద‌ని చెప్పారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)