Breaking News

కేరళ వైద్యురాలిపై దాడి: కేంద్ర ఆరోగ్యమంత్రికి వైద్యుల సంఘం లేఖ

Published on Thu, 05/11/2023 - 20:27

కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్‌ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే  వైద్యుల సంఘం ఫెడరేషన్‌ ఆప్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఓఆర్‌డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియాకు లేఖ  రాసింది. 

లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్‌ఓఆర్‌డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసీయేషన్‌(ఆర్‌డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.

అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్‌తో మార్చ్‌ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించడమే గాక  సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. 

కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్‌ అనే సస్పెన్షన్‌కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. 

(చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్‌..)

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)