Breaking News

ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్‌పై ఛార్జ్‌షీట్!

Published on Mon, 11/02/2026 - 13:53

కోచి: స్నేహితుల వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో  అప్‌లోడ్‌ చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ నిహాద్ అలియాస్ తొప్పిపై కేరళ సైబర్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలువా రూరల్ సైబర్ పోలీసులు ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో ఈ ఛార్జ్‌షీట్ సమర్పించారు. ఈ కేసులో నిందితుడిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులతో ఏర్పడిన వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో నిహాద్ వారి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా వీడియోలు అప్‌లోడ్‌ చేసిన యూట్యూబ్ ఛానల్‌ను తొలగించాలని పోలీసులు యూట్యూబ్ సంస్థకు లేఖ రాశారు. దీంతో సంబంధిత ఛానల్‌ను యూట్యూబ్ తొలగించింది.

గతంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలని నిహాద్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు రాకపోవడంతో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అనారోగ్య కారణాలను చూపుతూ విచారణకు హాజరుకాలేనని ఆయన తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. నిహాద్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు కీలక దశకు చేరుకుంది.

ఇదీ చదవండి: ‘జనశతాబ్ది’కి సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. కారణమిదే!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)