Breaking News

చిక్కుల్లో బాబా రామ్‌దేవ్‌

Published on Mon, 01/20/2025 - 19:41

తిరువనంతపురం: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యింది. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ  బాబా రామ్‌దేవ్‌తో పాటు ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీలపై కేరళ కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.

మోసపూరిత వ్యాపార ప్రకటనపై నమోదైన కేసులపై పాలక్కాడ్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ II కోర్టులో విచారణ జరిగింది. జనవరి 16న జరిగిన విచారణలో.. రామ్‌ దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీల ప్రతినిధులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టుకు రాలేదు. అందుకే నిందితులందరికీ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్నామని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.  తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘించినట్లు  పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీలు ప్రచారం చేసిన ప్రకటనలపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతుంది.  

గత రెండేళ్లుగా పతంజలి, దాని వ్యవస్థాపకులు అనేక చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పతంజలి ఆయుర్వేద్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఫిర్యాదు చేసింది. నాటి నుంచి రామ్‌ దేవ్‌ బాబా సంస్థలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. పతంజలి ఇస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు సైతం నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించాలని సూచించింది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

కాగా, రామ్‌ దేవ్‌ బాబా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం వ్యాధులను నయం చేయడం గురించి, అల్లోపతితో సహా, ఆధునిక వైద్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)