Breaking News

రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి.. కేంద్రం కీలక నిర్ణయం

Published on Wed, 01/15/2025 - 07:06

ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్‌ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్‌ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్‌ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్‌ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్‌ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)