Breaking News

పేపర్ లీక్ తర్వాత పెట్రోల్ పోరు..కేజ్రీవాల్ సన్నాహాలు

Published on Wed, 07/29/2026 - 13:42

న్యూఢిల్లీ: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం (E20)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజాగా ఈ20 విధానానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ20 వాడకం సురక్షితమేనా అని తాను 29 ఆటోమొబైల్ కంపెనీలను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై భయంతో ఏ కంపెనీ కూడా లిఖితపూర్వకంగా స్పందించలేదని అన్నారు.

సాంకేతికంగా ఈ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని కంపెనీల అధికారులు అనధికారికంగా అంగీకరించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాంట్లు మూసివేయిస్తామని, ఈడీ దాడులు చేయిస్తామని కేంద్రం నుంచి బెదిరింపులు వస్తున్నందునే వారు బయటకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో 2023కి ముందు కొనుగోలు చేసిన దాదాపు 30 కోట్ల వాహనాలను మోదీ ప్రభుత్వం పనికిరాకుండా చేస్తోందని ఆరోపించారు. ఇథనాల్‌ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.

శనివారం తలపెట్టిన టౌన్‌హాల్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అనుమతుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ20 విధానాన్ని శాంతియుతంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలే తరగబడతారని ఆయన హెచ్చరించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)