Breaking News

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌ పొత్తు

Published on Sun, 01/05/2025 - 05:53

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఆప్‌ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేజ్రీవాల్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొందరు మీడియా వ్యక్తులు మినహా మరెవరూ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు తెరవెనుక మైత్రిని సాగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పొసగలేదు. 

అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అంటూ విమర్శించడం..ప్రతిగా కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇండియా కూట మి నుంచి బయటకు పంపించేయాలని ఇతర పార్టీలను కోరుతాననే దాకా వెళ్లింది. శనివారం ఫిరోజ్‌షా మార్గంలోని తన నివాసం ఎదుట పంజాబ్‌కు చెందిన మహిళలు నిరసనకు దిగడంపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘వీరు పంజాబ్‌ మహిళలు కారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. పంజాబ్‌ మహిళలకు ఆప్‌పై నమ్మకముంది. వాళ్లు మమ్మల్ని విశ్వసించారు’అని చెప్పారు. బీజేపీకి ఒక ఎజెండా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. నాపై విమర్శలు చేయడం ద్వారానే బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)