Breaking News

తీహార్‌ జైలు నుంచి కవిత విడుదల

Published on Tue, 08/27/2024 - 17:43

న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌,హరీష్‌ రావుతో  పాటు పలు సీనియర్‌ నేతలు కవితకు తీహార్‌ జైలు బయట స్వాగతం పలికారు

 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టులో కవితకు బెయిల్‌ ఇచ్చింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్ట్‌27) తీహార్‌ జైలు నుంచి బయటకు వచ్చారు.

దాదాపూ 165 రోజులు జైలులో ఉన్న ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కవిత తీహార్‌ జైలు నుంచి విడుదల కావడం సుగమమైంది.  

 తీహార్‌ జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టుకు కవిత భర్త అని ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్‌ వారెంట్‌తో తీహార్‌ జైలుకు కవిత తరుఫు న్యాయవాదులు వెళ్లారు. తీహార్‌ జైల్లో కవితను విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలను సమర్పించారు.  

కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈడీ అరెస్ట్‌ కేసు విచారణ కొనసాగుతుండగానే అదే కేసులో ఏప్రిల్‌ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా తీహార్‌ జైలులో ఉన్నారు.

తీహార్‌ జైలు వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు
తీహార్‌ జైలు నుంచి విడుదలతో కవితను పరామర్శించేందుకు తిహార్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్ వచ్చారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)