అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
Published on Tue, 04/23/2024 - 15:47
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది.
ఈడీ వాదనలు:
- కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు
- మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు
- అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్టేకింగ్ ఇవ్వలేదు
- కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం
- ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది ,
- అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది
- సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది
- ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది
- కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు
- దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు
- పాలసీని సౌత్ గ్రూప్నకు అనుకూలంగా మార్చారు
- ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు
- ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది
- ట్రాన్సిట్ రిమాండ్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు
- అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం
- పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు
- ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు
- అరుణ్ పిళ్లై కవితకు బినామీ
- ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు
- ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది
- డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు
- బుచ్చి బాబు వాట్సాప్ చాట్లో కూడా ఈ విషయం బయటపడింది
- ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది
- ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు
- వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు
- గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి
- ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది
- కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి
#
Tags : 1