Breaking News

కర్ణాటకలో ట్రక్కు బోల్తా. 10 మంది దుర్మరణం

Published on Wed, 01/22/2025 - 09:59

బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు గంటల వ్యవధిలో మరోసారి నెత్తురోడింది.  ఉత్తర కన్నడ(Uttara Kannada) జిల్లాలో ఈ  ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

మరణించిన వారంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో వ్యాపారులు సావనూర్‌ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ ఓ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. 

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. 

ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందారనే వార్త బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 

అంతకు ముందు.. మంగళవారం అర్ధరాత్రి.. కర్ణాటకలోని హంపి(Hampi) క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు. కారు టైర్‌ ఊడిపడడంతో.. వాహనం బోల్తా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)