Breaking News

Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన

Published on Thu, 12/28/2023 - 15:55

బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్‌ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్‌లు చేతబట్టి బాత్రూమ్‌లు శుభ్రం చేయడం కనిపిస్తుంది.

కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్‌ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్‌ మాస్టర్‌ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్‌లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్‌ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్‌లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి.

గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్‌ చేయడంపై సీరియస్‌ అయ్యారు.  చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు.
చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్‌

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)