Breaking News

కుంకుమ పెడుతూ అసభ్యంగా తాకాడని..

Published on Tue, 08/26/2025 - 15:09

22 ఏళ్లుగా ఈ గుడిలో పూజారిగా పని చేస్తున్నా. ఆచారంగా వస్తున్న పనే నేను చేస్తున్నా. ఎవరూ ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పలేదు. ఏనాడూ నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు అంటూ  ఆలయ పూజారి నాగభూషణచార్‌ అంటున్నాడు. ఈలోపు.. ఆ పూజారి తమతోనూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు సోషల్‌ మీడియాలో సంచలన ఆరోపణలకు దిగుతున్నారు. 

కర్ణాటక తుమకూరు దేవరాయనదుర్గ కొండ మీద ఆలయ పూజారి నాగభూషణచార్‌ మీద జరిగిన దాడి నెట్టింట వైరల్‌ అవుతోంది. కుంకుమ పెట్టే వంకతో తమను అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ.. తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనపై దాడికి దిగారు. గుడి మెట్ల మీదనే కర్రలతో ఆయన్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే.. 

తానేమీ భక్తులతో అనుచితంగా ప్రవర్తించలేదని ఆయన అంటున్నారు. నా నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో భక్తుల మెడకు కుంకుమ రాయడం ఎప్పటి నుంచో చేస్తున్నా. వాళ్లు పొరపాటు పడి నా మీద దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా అని తెలిపారాయన. 

ఇదిలా ఉంటే.. దాడి చేసిన కుటుంబం హసన్‌ జిల్లాకు చెందిందిగా తెలుస్తోంది. అయితే వాళ్లు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)