Breaking News

డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య

Published on Tue, 12/02/2025 - 08:14

బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎంకు డీకే, ఆయన సోదరుడు డీకే సురేష్‌ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్‌, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు.

బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్‌ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్‌ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్‌, రాహుల్‌ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్‌ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలేమీ లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

ఇక, అంతకుముందు.. సీఎం సిద్దరామయ్యను మంగళవారం బ్రేక్‌ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్‌..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. 

డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య సదాశివనగర్‌లోని నివాసానికి రాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌ ఆయన్ను సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ దీనిని పదేపదే ఖండిస్తున్నా.. ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.

కర్ణాటకలో ఆసక్తికరంగా మారిన బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్

అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)