మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ
Breaking News
కరోనాతో మృతి చెందిన రైతులకు రుణమాఫీ
Published on Fri, 07/09/2021 - 09:55
సాక్షి, బెంగళూరు: కరోనాతో మృతి చెందిన రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు, వారి పంట రుణాలను మాఫీ చేస్తామని సహకారశాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ తెలిపారు. అయన గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడారు. ఎంతమంది రైతులు కరోనాతో చనిపోయిందీ వివరాలను సేకరించి, సహకార బ్యాంక్‌ల ద్వారా తీసుకున్న అప్పులను మాఫీ చేసే విషయంపై మూడురోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాగి, గోధుమ, వరికి సంబంధించి రూ. 720 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాలకు విడుదల చేసినట్లు తెలిపారు.
పరిశ్రమలపై
ఆస్తి పన్ను : శెట్టర్
యశవంతపుర: ఇళ్లు, భవనాలకు మాదిరిగానే పరిశ్రమలకు ప్రత్యేక ఆస్తి పన్నును విధించే విధానాన్ని త్వరలో నిర్ణయిస్తామని మంత్రి జగదీశ్‌శెట్టర్ తెలిపారు. నగరంలో ఎఫ్‌కేసీసీబీ ఆస్తి పన్ను పరిష్కరాల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆస్తి పన్నుల సమస్యలను పరిష్కరించాలని పారిశ్రామికవేత్తలు అనేక సార్లు తన దృష్టికి తెచ్చారన్నారు. వచ్చే బడ్జెట్‌లో కొత్త పరిశ్రమల చట్టాలను ప్రకటిస్తామన్నారు.
Tags : 1