Breaking News

రాజకీయాలు అంటే సినిమా కాదు.. పవన్‌కు కన్నడ మంత్రి చురకలు

Published on Fri, 12/12/2025 - 05:08

సాక్షి బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌­కళ్యాణ్‌ తీరుపై పొ­రు­గు రాష్ట్రం కర్ణాట­కలో కూడా తీవ్ర అ­భ్యంతరాలు వ్యక్తమవు­తున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచు­కుపడ్డారు. రాజకీ­యాలంటే సినిమా­లు కాద­ని, తెలుగు సినిమాలో మాత్రమే ఆయన హీరో అని, రాజకీ­యాల్లో కాదని ఆ రాష్ట్ర కార్మి­క శాఖ మంత్రి సంతోష్‌ ఎస్‌. లాడ్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌కళ్యాణ్‌పై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘ప్రజాసేవ అంటే సినిమా కాదు. జిమ్మిక్కులు, గిమ్మి­క్కులు, నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు.

అయినప్పటికీ బలవంతంగా రాజ­కీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు’.. అంటూ మంత్రి ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెళగావిలో మంత్రి సంతోష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌కళ్యాణ్‌కు ఒక మనవి చేస్తున్నా. మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అ­యితే ఇది సినిమా కాదు.

సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం? పేద­వారికి, శ్రామికుల కోసం, రాష్ట్రాభివృద్ధిపట్ల ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌డీఏ సర్కా­రులో భాగమైన మీరు విద్యా, ఉద్యోగాల విషయా­లపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి’.. అంటూ ఆయన హితవు పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కనీస వేతనం ఎంత? ఈ విష­యం పవన్‌కు తెలుసా?  ఇప్పుడెందుకు సనా­తన ధర్మం గురించి మాట్లాడు­తున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)