Breaking News

పెళ్లికి నిరాకరించిందని వివాహితను హత్య చేసి.. ఆ తర్వాత

Published on Sun, 01/04/2026 - 16:23

యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన  నిందితుడు రఫిక్ ఇమామ్‌సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.

అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)