Breaking News

‘మీ ఇల్లు బంగారం గాను..’

Published on Tue, 11/25/2025 - 21:54

గజ దొంగ సినిమాలో గోల్డ్‌ మ్యాన్‌ను ఉద్దేశించి ‘మీ ఇల్లు బంగారం గాను..’ అంటూ ఐటెం గర్ల్‌ ఆడిపాడుతుంది. పైన ఫొటో చూసి అదేదో నగల షాపు దుకాణమో లేదంటే నగల ఎగ్జిబిషన్‌ అనుకుంటే పొరపడినట్లే..!

ఈ కనిపించేది ఓ ప్రభుత్వ అధికారి బంగ్లా. ఇలాంటి బంగ్లాలు ఇలాంటివి ఆయనకు నాలుగైదు ఉన్నాయట. అలాంటి పది మంది అధికారుల ఇళ్లలో తనిఖీలు జరిపితే.. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, డబ్బు బయటపడ్డాయి..

మంగళవారం కర్ణాటక యాంటీ కరప్షన్‌ ఏజెన్సీ లోకాయుక్త జరిపిన తనిఖీల్లో విస్తుపోయే ఈ దృశ్యాలు కనిపించాయి. లోకాయుక్త అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో రంగంలోకి దిగారు.


బెంగళూరు, మైసూరు, మాండ్య, బీదర్, ధారవాడ, హవేరి, శివమొగ్గ, దావణగెరెలో ఈ తనిఖీలు జరిగాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D.M. గిరీష్, మాండ్య టౌన్ ప్లానింగ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ C. పుట్టస్వామి, బీదర్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రేమ్ సింగ్, మైసూరు హూటగల్లి మునిసిపాలిటీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ C. రామస్వామి, ధారవాడ కర్ణాటక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాష్ చంద్ర, హవేరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేకప్ప, బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ RTO ఆఫీస్ సూపరింటెండెంట్ P. కుమారస్వామి, శివమొగ్గ SIMS మెడికల్ కాలేజ్ FDA నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 

కోట్ల విలువైన ఆస్తి పత్రాలు.. పెద్ద మొత్తంలో నగదు.. బంగారు ఆభరణాలు.. విలాసవంతమైన బంగ్లాలు ఉన్నట్లు తేలింది. అయితే తనిఖీలు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ప్రకటించారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)