Breaking News

సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

Published on Tue, 06/10/2025 - 15:33

సాక్షి, బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 5న ఎం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌ అభిమానుల తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తొక్కిసలాట మరణాలపై జవాబుదారీతనం, ఈ సంఘటనను ప్రభుత్వం నిర్వహించిన తీరు, దాని పర్యవసానాల గురించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.


ఐపీఎల్-18లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇందులో భాగంగా జూన్‌ 5న ఆర్సీబీ టీం విజయోత్సవ వేడుకలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. అయితే, ఈ వేడుకలు విషాదానికి దారితీశాయి. తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు పరిమితి మించి పబ్లిక్‌ రావడం, తగు చర్యలు తీసుకోకపోవడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో మరోసారి ఈ తరహా విషాదాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్‌ 10న కేసు విచారణ చేపట్టింది.

ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)ను పలు ప్రశ్నలు సంధించింది. తొక్కిసలాట ఘటనపై విచారణను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ (సీసీబీ)‌ ‌ నుంచి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ)కి బదిలీ చేసింది. సీసీబీ ఇప్పటికే నిందితుణ్ని అరెస్ట్‌ చేసింది.

కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు తొమ్మిది ప్రశ్నలు  

  1. 1.ఆర్సీబీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ఎప్పుడు? ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు? ‌
    2.ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
    3.పబ్లిక్‌ని,క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
    4.ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు స్టేడియం దగ్గర మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు?
    5.వేడుక జరిగే సమయంలో ఎంతమంది ఉండవచ్చు అనే దానిపై ముందస్తుగా ఏదైనా అంచనా వేశారా? 
    6.గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించారా? లేకపోతే ఎందుకు?
    7. గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది?
    8.ఈ తరహా వేడుకలు నిర్వహణ సమయంలో 50వేలు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా ఎలాంటి విధానాన్ని అవలబించారు? రూపొందించబడిందా?
    9. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా?


ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తన సమాధానాలను సీల్డ్‌ కవర్‌లో అందించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం తరుఫున ఏజే కోర్టులో తన వాదనల్ని వినిపించారు. నిందితులు తమ అరెస్టుల చట్టబద్ధతను సవాలు చేయడానికి, ఉపశమనం పొందడానికి దర్యాప్తు, అరెస్టు సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఉదహరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తొక్కిసలాటపై బహిరంగ కోర్టులో మరిన్ని వివరాలను వెల్లడించలేమని  అన్నారు.

సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధి నిఖిల్ సోసలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్‌లో సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురు ప్రముఖుల్ని కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది. వాటికి స్పందించేందుకు ఏజే సమయం కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)