Breaking News

దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..

Published on Fri, 09/01/2023 - 19:54

సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్‌ తగిలింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్‌ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్‌. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. 
చదవండి: ఆదిత్య ఎల్‌1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా..

అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం.

అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు