karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్

Published on Thu, 01/22/2026 - 12:28

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే  అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు (గురువారం) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు. కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి, తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)నకు సంబంధించిన వివాదాస్పద చట్టంపై ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని పేరాలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఉన్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన  బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పెరుగుతున్న అగాధానికి అద్దం పడుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మరుసటి రోజే కర్ణాటకలో ఈ తరహా ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు కేరళ గవర్నర్ కూడా తన ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవకుండా వదిలేశారు.

 

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలలోని దాదాపు 11 పేరాలను తొలగించాలని గవర్నర్ గెహ్లాట్ ముందే సూచించారు. అయితే, ప్రభుత్వం వాటిని మార్చకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదవకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 మరియు 163 ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, దీనిపై నిరసన తెలపడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)