Breaking News

సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు

Published on Tue, 03/05/2024 - 16:13

ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్‌ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. 

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్‌ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

తమకు 2.5 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. 

‘సినిమా ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే,  కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము.  మీకు పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేస్తాం. మా నెక్ట్స్‌ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్‌లో పేర్కొన్నారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)