Breaking News

స్వామీజీ నుంచి మైక్ లాక్కున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

Published on Fri, 01/27/2023 - 19:51

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాగేసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. తాను అందరిలా కాదని, ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసి తీరుతానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు. వారి ఇబ్బందులను ఎవరూ తీర్చడం లేదని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్న సీఎం స్వామీజి నుంచి మైక్ లాగేసుకుని మధ్యలో మాట్లాడారు. తాను ఇతర నాయకుల్లా కాదని, ఏదైనా చెబితే చేసి తీరుతానని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గుంతల రోడ్లు, ఇతర సమస్యలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినప్పుడు వరదల్లో మునిగిపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలనే స్వామీజి ప్రస్తావించగా సీఎం మైక్ లాక్కుని మధ్యలో జోక్యం చేసుకున్నారు.
చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు