నీట్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీర్మానం!

Published on Tue, 07/23/2024 - 08:24

బెంగళూరు: నీట్‌ యూజీ- 2024 పేపర్‌ లీక్‌, నిర్వహణలో అవకతవకలు దేశంలో దుమారం రేపాయి. అయితే తాజాగా నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో రెండు తీర్మానాలను సోమవారం కర్ణాటక రాష్ట్ర కేబినెట్‌  ఆమోదించినట్లు సమాచారం. మరో రెండు తీర్మానాలు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

నీట్‌ పేపర్ లీక్‌ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. నీట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రాలే సొంతంగా తమ పరీక్షలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు.. కేబినెట్‌లో  ఆమోదం  పొందిన ఈ తీర్మానాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపట్టనున్నారు. వీటీతోపాటు, గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024కు కేబినెట్  ఆమోదం తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)