Breaking News

కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే!

Published on Mon, 08/03/2026 - 13:09

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ సోమవారం జరగనుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన 20 మంది కొత్త మంత్రుల జాబితా ఖరారైంది. లోక్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 34 మంది సభ్యులున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 20 మంత్రి స్థానాలను నేడు భర్తీ చేయనున్నారు.

ఢిల్లీలో పార్టీ కేంద్ర పెద్దలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌లు కాంగ్రెస్ హైకమాండ్‌తో ఈ భేటీలు నిర్వహించారు.
మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకోనున్న 20 మంది నేతల జాబితా ఇదే..
1. పీఎం నరేంద్రస్వామి
2. శివరాజ్ తంగడగి
3. రుద్రప్ప లామాಣಿ
4. కేఎస్‌ బసవంత్రప్ప
5. బీ నాగేంద్ర
6. టీ రఘుమూర్తి
7. బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్
8. రిజ్వాన్ అర్షద్
9. సంతోష్ లాడ్
10. మధు బంగారప్ప
11. పుట్టరంగశెట్టి
12. మంకాల వైద్య
13. అజయ్ సింగ్
14. ఎన్ చలువరాయస్వామి
15. కేఎం శివలింగే గౌడ
16. హెచ్‌సీ బాలకృష్ణ
17. గాయత్రి శాంతే గౌడ
18. బసవరాజ్ రాయారెడ్డి
19. విజయానంద్ కాశప్పనవర్
20. లక్ష్మణ్ సవది
మాజీ స్పీకర్ యూటీ ఖాదర్ మంత్రివర్గంలోకి చేరడంతో, రోన్ ఎమ్మెల్యే జీఎస్‌ పాటిల్ కర్ణాటక శాసనసభ కొత్త స్పీకర్‌గా నియమితులవుతున్నారు. విరాజ్‌పేట ఎమ్మెల్యే  ఏఎస్‌ పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే శాసనమండలిలో సీనియర్ సభ్యుడు సలీమ్ అహ్మద్ మండలి కొత్త చైర్మన్‌గా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఉమాశ్రీ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా చివరి ఫొటో..

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)