Breaking News

వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్‌ వద్ద ప్రమాదానికి గురైన కారు

Published on Sun, 10/06/2024 - 15:46

బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్‌ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.  ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్‌ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.

ముంతాజ్‌ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్‌లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ పట్టివేత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)