Breaking News

‘పాట వినపడలే..’.. ప్రముఖ సింగర్‌ షోలో ఫ్యాన్స్ కన్నీళ్లు!

Published on Wed, 03/04/2026 - 12:02

ముంబై: ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ‘పీ-పాప్ కల్చర్ వరల్డ్ టూర్’ పేరిట ముంబైలో నిర్వహించిన కన్సర్ట్ వివాదాస్పదంగా మారింది. హోలీ థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ, పూణేలలో జరిగిన ప్రదర్శనలు సవ్యంగా సాగినప్పటికీ ముంబైలో నిర్వాహక లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మండుతున్న ఎండలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.

మార్చి 3న జరిగిన ఈ కన్సర్ట్‌లో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనడమే కాకుండా, ఎండ వేడికి తట్టుకోలేక పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ జోన్‌లో మాత్రమే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి, వీఐపీ, జనరల్ జోన్లను గాలికి వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సి రావడంతో చాలా మంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. వేదిక చాలా దూరంగా ఉండటం, భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసలు కరణ్ ఔజ్లా  ఉన్నాడో లేడో కూడా అర్థం కాలేదని కొందరు అభిమానులు వాపోయారు. ప్రొఫెషనల్ కన్సర్ట్‌లా కాకుండా స్కూల్ యాన్యువల్ డే వేడుకలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ విమర్శలపై గాయకుడు కరణ్ ఔజ్లా స్పందించారు. ముంబై అభిమానుల అసంతృప్తిని గమనించిన ఆయన.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా వారికి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. ముంబైలో మరోసారి నైట్ కన్సర్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన టీమ్ మరింత పటిష్టమైన ఏర్పాట్లతో తిరిగి వస్తుందని, అభిమానులకు మెరుగైన అనుభూతిని అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ రెండో షోకు సంబంధించిన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 28న ఢిల్లీలో 75 వేల మంది అభిమానుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన ఈ టూర్.. రాబోయే రోజుల్లో చండీగఢ్, ఇండోర్, బెంగళూరు సహా పలు నగరాల్లో కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిస్సైళ్లు!

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)