Breaking News

యాత్రలో అపశ్రుతి. భక్తుల బస్సుకు హై టెన్షన్ వైర్లు తగిలి..

Published on Sun, 07/16/2023 - 08:23

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మతపరమైన యాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ ఉత్తరప్రదేశ్‌లోని మిరట్‌ జిల్లా, భవాన్‌పురీ రాలీ చౌహాన్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్‌లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు.. భవాన్‌పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్‌లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

అప్రమత్తమైన గ్రామస్తులు విద‍్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ‍్యక్తం చేశారు.   

కాగా.. కన్వార్ యాత్ర భారతదేశంలో అతిపెద్ద మతపరమైన యాత్రల్లో ఒకటి. ప్రతీ ఏడాది ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర‍్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చంఢీగర్‌, ఒడిశా, జార్ఖండ్ నుంచి కోటీ ఇరవై లక్షల వరకు భక్తులు హాజరవుతారు. కన్వారియాలు కాశాయ వస్త‍్రాలు ధరించి చెప్పులు లేకుండా యాత్రకు వెళతారు. 

ఇదీ చదవండి: ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)