Breaking News

దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!

Published on Mon, 11/13/2023 - 08:56

దీపావళి రోజున ఉత్తరప్రదేశ్‌(యూపీ)లోని కాన్పూర్ దేహత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్‌కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి:  ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40  మంది కూలీలు?

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు